Homeహైదరాబాద్latest Newsకంగ్టి లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

కంగ్టి లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

ఇదే నిజం, కంగ్టి: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో బుధవారం పిఏసిఎస్ చైర్మన్ మారుతి రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చంద్ర రెడ్డి , మాజీ పిఏసిఎస్ చైర్మన్ మనోజ్ పాటిల్ మరియ కాంగ్రెస్ నాయకులు సమక్షంలో కేక్ కాట్ చేసి చేయడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..మన దేశంలో అలుముకున్న చీకట్లను చీల్చుకుంటూ ఉదయిస్తున్న సూర్యుడు మన ఏఐసీసీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు. భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, ఆర్థిక సమస్యలు, సామాజిక అసమానతలు తొలగాలని న్యాయ్ యాత్ర లాంటి చారిత్రాత్మకమైన కార్యక్రమలు నిర్వహించి దేశ ప్రజలను ఒకటి చేసిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ అని తెలిపారు. ఈ కార్యక్రమం లో భూమా రెడ్డి, చెన్న బసప్ప, జగదీష్ పాటిల్ , మనిక్ పాటిల్ , సంతోష్ పాటిల్, కుపెందర్ రెడ్డి, సంతోష్ పాట్నా, మొగులప్ప, శ్రీను రెడ్డి, నర్సింలు, విఠల్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img