Rahul gandhi : ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ మాట్లాడుతూ అయోధ్యలో రామమందిరం నిర్మించిన రోజే భారతదేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన ‘ఇందిరా భవన్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul gandhi ) పాల్గొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ పై రాహుల్ గాంధీ మండిపడ్డారు. మోహన్ భగవత్ చెప్పింది దేశద్రోహం. అతను రాజ్యాంగం మరియు బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమానికి వ్యతిరేకంగా ధైర్యంగా మాట్లాడాడు. ఇతర దేశాల్లో ఇలా మాట్లాడి ఉంటే అరెస్ట్ చేసెవారు అని రాహుల్ గాంధీ అన్నారు. 1947లో భారతదేశానికి నిజమైన స్వాతంత్ర్యం రాలేదన్న మోహన్ భగవత్ ప్రకటన మన స్వాతంత్ర్య సమరయోధులను, ప్రతి భారతీయ పౌరుడిని అవమానించడమేనని, అది మన రాజ్యాంగంపై దాడి లాంటిదని రాహుల్ గాంధీ అన్నారు.