కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ‘ప్రత్యేక హోదాలో జగన్ విఫలమయ్యారు. ఏనాడూ కేంద్రాన్ని ప్రశ్నించలేదు. పోలవరం ఎందుకు పూర్తి కాలేదు. అధికారంలోకి రాగానే మేం పూర్తి చేస్తాం. మహిళలకు రూ. లక్ష ఇస్తాం. రైతు రుణమాఫీ, మద్దతు ధర, 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. ఉపాధి హామీ కూలీలను రూ. 400 కు పెంచుతాం. అంగన్ వాడీ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని’ కడపలో జరిగిన సభలో మాట్లాడారు.