Homeహైదరాబాద్latest Newsరాహుల్ గాంధీ భారత పౌరుడే కాదు.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

రాహుల్ గాంధీ భారత పౌరుడే కాదు.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

  • ఢిల్లీ హై కోర్టులో బీజేపీ నేత పిటిషన్​
  • యూకేలో రాహుల్​ బ్రిటిషర్​గా ప్రకటించుకున్నట్లు ఆరోపణ
  • ఐదేళ్ల క్రితమే కేంద్ర హోం శాఖ లేఖ

ఇదే నిజం, నేషనల్​ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఢిల్లీ హై కోర్టులో సంచలన పిటిషన్​ దాఖలైంది. రాహుల్​ భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీ భారత పౌరసత్వాన్ని రద్దు చేసేలా కేంద్ర హోం శాఖని ఆదేశించాలని ఆయన హైకోర్టును కోరారు. 2003లో యూకేలో బ్యాకాప్స్ లిమిటెడ్ అనే సంస్థ రిజస్టర్ చేయబడిందని, రాహుల్ గాంధీ దాని డైరెక్టర్లు, దాని సెక్రటరీల్లో ఒకరని, 2019లోనే హోం మంత్రిత్వ శాఖకు సుబ్రమణ్య స్వామి లేఖ రాశారు. అక్టోబర్ 10, 2005 , అక్టోబర్ 31,2006న దాఖలు చేసిన సంస్థ వార్షిక రిటర్న్స్‌లో రాహుల్ గాంధీ తన జాతీయతను బ్రిటిష్‌గా ప్రకటించుకున్నారని ఆయన ఆరోపించారు.

ఫిబ్రవరి 17,2009న బ్యాకప్స్ లిమిటెడ్ రద్దు అప్లికేషన్‌లో కూడా మళ్లీ ఆయన తన జాతీయతను బ్రిటిష్‌గా ప్రకటించుకున్నట్లు ఆయన కోర్టులో దాఖలు చేసిన పిటిషన్​లో పేర్కొన్నారు. ఈ చర్యలతో రాహుల్​ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని స్వామి ఆరోపించారు. రాహుల్​ తనను బ్రిటిష్​గా ప్రకటించుకోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 9, భారత పౌరసత్వ చట్టం 1955ను ఉల్లంఘించినట్టేనని పేర్కొన్నారు నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 29, 2019న హోం మంత్రిత్వ శాఖ రాహుల్ గాంధీకి లేఖ రాసింది. దీనిపై పదిహేను రోజుల్లో స్పందించి సమాచారం ఇవ్వాలని రాహుల్ గాంధీని కోరింది. ఐదేళ్లు దాటినా నేటికీ రాహుల్ నుంచి ఎలాంటి సమాధానం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img