HomeజాతీయంRahul gandhi khammam:తెలంగాణలో కర్ణాటక ఫలితాలే రిపీట్ - రాహుల్ గాంధీ

Rahul gandhi khammam:తెలంగాణలో కర్ణాటక ఫలితాలే రిపీట్ – రాహుల్ గాంధీ

Rahul gandhi khammam:తెలంగాణలో కర్ణాటక ఫలితాలే రిపీట్ అవుతాయని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు.మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక, భట్టి పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభలో రాహుల్‌గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ , “భారత్‌ జోడోయాత్ర తర్వాత తెలంగాణకు రావడం సంతోషంగా ఉంది. దేశాన్ని ఏకం చేసేందుకు జోడో యాత్ర చేశా. ప్రజల్లో విద్వేషం తొలగించే ప్రయత్నం చేశా. అది కాంగ్రెస్‌పార్టీ సిద్ధాంతం. దేశమంతా భారత్‌ జోడో యాత్రను సమర్థించింది. జోడో యాత్రలో పాల్గొన్నందుకు మీకందరికీ ధన్యవాదాలు. భారాసను వీడి కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని స్వాగతిస్తున్నా. పొంగులేటి పులిలా పోరాడుతున్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఖిల్లా. మీ మనసుల్లో.. మీ రక్తంలో కాంగ్రెస్‌ ఉంది. పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్న భట్టి విక్రమార్కకు అభినందనలు అన్నారు

బీఆర్ఎస్ అంటే ‘‘ బీజేపీ రిష్తెదార్ సమితి’’ బిజెపి బంధువుల పార్టీ అని అభివర్ణించారు కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ… కేసీఆర్ స్కాంలు మోడీకి తెలిసినా ఆయన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కేసీఆర్ రిమోట్ కంట్రోల్ మోడీ చేతిలో వుందన్నారు. ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ అవినీతికి మోడీ ఆశీస్సులు వున్నాయని.. ఆయన స్కాంల గురించి మోడీ దర్యాప్తు సంస్థలకు తెలుసునంటూ రాహుల్ దుయ్యబట్టారు. బీఆర్ఎస్‌ను బీజేపీకి బీ టీమ్‌గా పోల్చిన ఆయన… వ‌చ్చే ఎన్నిక‌ల‌లో ఈ బి టీమ్ ను ఇంటికి పంపుతామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

తెలంగాణలో బీజేపీ ఖతమైపోయిందన్న రాహుల్.. ఇప్పుడు రాష్ట్రంలో ఆ పార్టీ అడ్రస్ లేదన్నారు. సమాజంలో అన్ని వర్గాలను కేసీఆర్ దోచుకున్నారని.. పార్లమెంట్‌లో బీజేపీకి అన్ని విధాలుగా బీఆర్ఎస్ అండగా నిలిచిందని రాహుల్ దుయ్యబట్టారు. రైతుల బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తే.. బీఆర్ఎస్ మద్ధతిచ్చిందని ఆయన గుర్తుచేశారు. కర్ణాటకలో బీజేపీని ఓడించినట్లే తెలంగాణలో బీఆర్ఎస్‌ను ఓడిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. బీఆర్ఎస్‌తో తమకు ఎలాంటి ఒప్పందం లేదని.., ఇటీవల జరిగిన విపక్షాల సమావేశానికి బీఆర్ఎస్‌ వస్తే మేం రాం అని చెప్పామని ఆయన గుర్తుచేశారు. కేసీఆర్ తెలంగాణకు రాజులా భావిస్తాడని, రాష్ట్రాన్ని జాగీరులా ఫీలవుతాడని రాహుల్ మండిపడ్డారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం నిరుపేదలకు, గిరిజనులకు ఇచ్చిన భూములను కేసీఆర్ లాక్కుంటున్నారని ఆరోపించారు. ఈ భూముల విషయం భారత్ జోడో యాత్రలో తన దృష్టికి తీసుకొచ్చారని.. ఈ భూములు కేసీఆర్‌వి కావని మీవని రాహుల్ చెప్పారు. ముఖ్యమంత్రి అవినీతి పరాకాష్టకు చేరిందని.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. ధరణి పోర్టల్ విషయం భారత్ జోడో యాత్ర చేసినప్పుడు తన దృష్టికి వచ్చిందని రాహుల్ గాంధీ తెలిపారు. ధరణి ద్వారా ముఖ్యమంత్రి భూములను , మిషన్ భగీరథలో వేల కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. రైతులు, దళితులు, ఆదివాసీలు ఇలా అన్ని వర్గాల నుంచి కేసీఆర్ దోచుకుంటున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
తెలంగాణలో భాజపా పని అయిపోయింది. మొదట్లో ఇక్కడ ముక్కోణపు పోటీ అనుకున్నారని, అయితే బిజెపి ఇక్కడ పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తెలంగాణాలో బిజెపి బీటీమ్‌ భారాస, కాంగ్రెస్‌ మధ్యే పోటీ ఉం. ద‌న్నారు. కర్ణాటకలో భాజపాను ఓడించిన విధంగానే తెలంగాణలో భాజపా బీటీమ్‌ను ఓడించబోతున్నాం. భారాసతో కాంగ్రెస్‌కు ఎలాంటి ఒప్పందం ఉండద‌ని డంకా బ‌జాయించి చెప్పారు.
ఖమ్మం వేదికగా ఎన్నికల హామీలు ప్రకటిస్తూ తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేయూత పేరుతో వృద్ధులు, వితంతులకు రూ.4వేలు పింఛను ఇస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రకటించారు. పోడుభూములన్నీ గిరిజనులకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. మ‌హిళ‌ల అభ్యున్న‌తికి ప్ర‌త్యేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తామ‌ని అన్నారు.. రెగ్యుల‌ర్ గా ఉద్యోగా నియ‌మాకాలు జ‌రుపుతామ‌ని, రైతుల‌కు అన్ని విధాల తొడ్పాటు అందిస్తామ‌ని చెప్పారు రాహుల్ గాంధీ

Recent

- Advertisment -spot_img