రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు 20 చోట్ల ఫార్మా ఏర్పాటు చేస్తున్నామన్నారు.. ఇప్పుడు ఆ 20 చోట్ల భూసేకరణ విరమించుకుంటున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడైనా భూసేకరణ చేయాలి అంటే అక్కడ రెండు పంటలు పండే భూమి ఉన్నా, 80 శాతం రైతుల సమ్మతం లేకపోయినా, డీపీఆర్ లేకపోయినా ఎట్టి పరిస్థితిలో భూమి తీసుకోవద్దని రేవంత్ రెడ్డినే చెప్పాడు.. ఈ మూడిటిలో లగచర్లలో ఒక్కటైనా ఉందా? అని నిలదీశారు. అన్ని పార్టీలను, ఫాక్ట్ ఫైండింగ్ కమిటీని లగచర్లకు పంపు అన్ని ఉన్నాయో లేదో చూద్దాం అని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి కేవలం 12 వేల ఉద్యోగాలు ఇచ్చాడు..కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లను ఈయన ఇచ్చినట్టు ఖాతాలో వేసుకున్నాడు అని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి గురించి మొత్తం రాహుల్ గాంధీకి తెలుసు. అందుకే దూరం పెడుతున్నాడు. కానీ బయటకి తెలియకుండా స్వాతిముత్యంలా యాక్టింగ్ చేస్తున్నాడు అని కేటీఆర్ తెలిపారు.