Homeహైదరాబాద్latest NewsRahul Gandhi : నాన్నమ్మా.. నువ్వే నా శక్తి

Rahul Gandhi : నాన్నమ్మా.. నువ్వే నా శక్తి

– ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా రాహుల్​ ఎమోషనల్​ ట్వీట్​

ఇదేనిజం, నేషనల్​ బ్యూరో: ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ ఎమోషనల్ ట్వీట్ చేశారు. భావోద్వేగ వీడియోను షేర్‌ చేశారు. 1984లో ఇందిరా గాంధీ చనిపోయిన తర్వాత ఆమె పార్థివదేహం వద్ద రాహుల్‌ గాంధీ కన్నీటి పర్యంతమవుతున్న దృశ్యాలతోపాటు, ఇందిరాగాంధీ ప్రజలతో మమేకమైన సందర్భాలు, ఐక్యరాజ్యసమితిలో ఆమె ప్రసంగించేందుకు వెళ్తున్న వీడియోలు షేర్​ చేశారు. ‘నానమ్మ నా శక్తి నువ్వే.. భారత్‌ కోసం నువ్వు సర్వస్వం త్యాగం చేశావు. ఈ దేశాన్ని నేను ఎప్పటికీ కాపాడుతుంటాను.’ అంటూ రాహుల్​ రాహుల్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img