Homeతెలంగాణరాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు నివాసంలో కేక్ కట్..

రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు నివాసంలో కేక్ కట్..

ఇదేనిజం, మంథని: మంథని మండల&మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మరియు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. రాష్ట్ర ఐటిమంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు నివాసంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఐటీ& పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
బావి భారత ప్రధాని, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, రాయబారెల్లి ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ… రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర ద్వారా దేశం మొత్తం పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పార్లమెంట్లో ప్రస్తావిస్తూ పాలకులకు కళ్ళు తెరిపించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి అని అన్నారు.
2004 మరియు 2009 లో రెండుసార్లు ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చిన నాయకుడు రాహుల్ గాంధీ వద్దన్నా నాయకుడు రాహుల్ గాంధీ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు. విశిష్ట గుర్తింపు అయినటువంటి ఆధార్ కార్డు మరియు ఉపాధి హామీ , నిర్భయ లాంటి చట్టాలను ఆలోచన చేసింది రాహుల్ గాంధీ అని కొనియాడారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితేనే ఈ దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని వారు తెలిపారు.

Recent

- Advertisment -spot_img