Homeజిల్లా వార్తలుఈ నెల 5న తెలంగాణలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం

ఈ నెల 5న తెలంగాణలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం

తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికల రాజకీయం రస వత్తరంగా మారింది. అభ్యర్థులతో పాటు కీలక నేతల ప్రచారాలతో రాజకీయ కాక రేగుతోంది. ప్రధాన పార్టీల నుంచి కీలక నేతలు రంగంలోకి దిగడం తో విమర్శలు, ప్రతివిమర్శలతో రాష్ట్రం వేడెక్కింది. ముఖ్యంగా జాతీయ పార్టీల నేతలు రాష్ట్రానికి వస్తుండ టంతో ప్రచారం మరింత ఊపందుకుంది. ఇప్పటికే మోదీ, అమిత్ షా, నడ్డా బీజేపీ తరఫున ప్రచారం చేశారు. ఇక కాంగ్రెస్ నుంచి కూడా జాతీయ నేతలు రంగంలోకి దిగుతున్నారు.

ఇందులో భాగంగానే లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల రాష్ట్ర పర్యటన ఖరారైనట్లు పీసీసీ వర్గాలు వెల్లడిం చాయి. ఈ నెల 5వ తేదీన రాహుల్ గాంధీ నిర్మల్, గద్వాల్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్ధు లకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారని తెలిపాయి. ఈ నెల 9వ తేదీన కరీంనగ ర్, సరూర్ నగర్, ప్రచారం చేయనున్నారు. ఈ నెల 6,7వ తేదీల్లో ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రానున్నా రు. 6వ తేదీన ఎల్లారెడ్డి, తాండూర్, సికింద్రాబాద్ ఎన్నికల ప్రచార సభలకు, 7వ తేదీన నర్సాపూర్, కూకట్పల్లిలో ప్రియాంక ప్రచారం చేయనున్నారు.

Recent

- Advertisment -spot_img