– ఫ్రీ బస్సు స్కీమ్‌పై మహిళలతో ముచ్చటించిన నేతలు
– సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. గురువారం రాత్రి సరూర్‌నగర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ ముగిసిన అనంతరం రాహుల్, రేవంత్.. దిల్‌సుఖ్‌నగర్‌లో సిటీ బస్సు ఎక్కి కొద్ది దూరం జర్నీ చేశారు. మహిళలు, యువతతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన ఫ్రీ బస్సు స్కీమ్‌పై ఆరా తీశారు. ఇతర పథకాలపై గురించి వారితో మాట్లాడారు. అనంతరం బస్సులో ఉన్న ప్రయాణికులకు కాంగ్రెస్ మేనిఫెస్టో కాపీలను పంపిణీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది