Homeతెలంగాణరాహుల్​ ఆశిస్సులు రేవంత్​కే?

రాహుల్​ ఆశిస్సులు రేవంత్​కే?

– కాంగ్రెస్​కు ఫుల్​ మెజార్టీ వస్తే రేవంతే సీఎం
– మెజార్టీ తగ్గితే ఉత్తమ్​కు చాన్స్​?
– ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ
– రంగంలోకి డీకే .. బీఆర్ఎస్ అసంతృప్తులకూ గాలం

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశిస్సులు సంపూర్ణంగా రేవంత్​ రెడ్డికే ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి ఫుల్​ మెజార్టీ వస్తే కచ్చితంగా రేవంత్​ రెడ్డినే ఆయన ముఖ్యమంత్రిగా ప్రతిపాదించే అవకాశం ఉంది. ఒకవేళ మెజార్టీ తగ్గితే ఇతర ఎమ్మెల్యేలు గ్రూపులు కట్టే అవకాశం ఉంది కనక అధిష్ఠానం కొంతమేర తలొగ్గే చాన్స్​ ఉంది. అయితే రేవంత్​ రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాకే కాంగ్రెస్ పార్టీ బలపడిందని రాహుల్​ భావిస్తున్నారట. అందుకే ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.

బెంగళూరులో రూమ్స్​ బుక్
రేపు ఫలితాలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్​ అలర్ట్​ అయ్యింది. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందేవారు చేజారికుండా పకడ్బందీగా వ్యూహాలు రచిస్తోంది. ఈ బాధ్యత మొత్తం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​ పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఎన్నికల ఫలితాలు పూర్తి కాగానే.. ఎమ్మెల్యేలను కర్ణాటకలోని హోటళ్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి మెజార్టీ వచ్చినా.. మ్యాజిక్​ ఫిగర్​ కు తక్కువ వచ్చినా ఎమ్మెల్యే అభ్యర్థులను మాత్రం బెంగళూరుకు తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.

పూర్తి మెజార్టీ రాకపోతే..
ఒకవేళ కాంగ్రెస్​ పార్టీకి మెజార్టీ రాకపోతే బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకొనేందుకు సైతం డీకే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో అధికారం నిలబెట్టుకోవాలని చూస్తున్న కాంగ్రెస్​ పార్టీ.. మొత్తం బాధ్యతను డీకేకు అప్పగించింది. ఇక బీఆర్ఎస్​ సైతం రాష్ట్రంలోని పరిస్థితులను సైలెంట్​గా గమనిస్తోంది. కాంగ్రెస్​, బీఆర్ఎస్​ కు సమానస్థానాలు వస్తే.. ఎంఐఎం, బీజేపీ సపోర్ట్​తో అధికారంలోకి రావాలని చూస్తోంది. కాంగ్రెస్​ పారా చూట్​ లీడర్లు సైతం తమ పార్టీలోకి వస్తారని ఆ పార్టీ భావిస్తోంది.

Recent

- Advertisment -spot_img