HomeజాతీయంRailway:అత్యుత్తమ పనితీరు నమోదు చేసిన దక్షిణ మధ్య రైల్వే

Railway:అత్యుత్తమ పనితీరు నమోదు చేసిన దక్షిణ మధ్య రైల్వే

Railway:దక్షిణ మధ్య రైల్వే 2023 మే నెలలో ప్రయాణీకుల మరియు సరుకు రవాణా విభాగంలో అత్యుత్తమ నెలవారీ పనితీరును నమోదు చేసింది. జోన్ మొదటి సారిగా నెలవారీ ప్రయాణీకుల ఆదాయంలో రూ. 500 కోట్ల మార్కును అధిగమించింది. దానిద్వార ప్రయాణీకుల ఆదాయాన్ని మే 2023లో , రూ.513.41 కోట్లు ఆర్జించింది . ఏప్రిల్, 2023లో ఆర్జించిన అత్యుత్త మైన రూ. 467.82 కోట్లు కంటే అధికము. అదే విధంగా, జోన్ మే, 2023 నెలలో 12.517 మిలియన్ టన్నుల సరుకు రవాణా మునుపెన్నడూ లేని విధంగా చేసింది. ఇది మార్చి2023 లోని అత్యుత్తమ 12.370 మిలియన్ టన్నులు కంటే అత్యధికం .

జోన్ 2023 మే నెలలో 26.11 మిలియన్ల మంది ప్రయాణీకులను చేరవేసింది. గత 2022 మే నెలలో 21.12 మిలియన్ల ప్రయాణికులతో పోలిస్తే 24% వృద్ధిని సాధించింది. సాధారణ రైళ్లు కాకుండా వేసవి కాలంలో అదనపు రద్దీ అవసరాలను తీర్చడానికి మే నెలలో జోన్ 538 ట్రిప్పుల ప్రత్యేక రైళ్లను నడిపింది. ఇది అదనంగా 4.65 లక్షల మంది ప్రయాణీకులను రవాణా చేయడం ద్వారా రూ. 36.52 కోట్ల ఆదాయం సంపాదించింది .

సరుకు రవాణా విభాగంలో, జోన్ మే 2023లో 12.517 ఎమ్ టిలు ల సరుకును రవాణా చేసింది, ఇది ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా ఒక నెలలో సాధించిన అత్యుత్తమ సరుకు రవాణా లోడింగ్. గత సంవత్సరం నమోదైన సంబంధిత లోడింగ్ కంటే ఇది దాదాపు 7% ఎక్కువ. అదే సమయంలో, సరుకు రవాణా ఆదాయం ఈ ఏడాదిలో 14% వృద్ధి చెంది రూ. మే, 2023లో రూ .1213.36 కోట్లు నమోదు చేసింది . గత ఏడాది మే, 2022 లో 1065.15 కోట్లు నమోదు చేసింది.

జోన్ యొక్క మొత్తం సరుకు రవాణా లోడింగ్‌లో బొగ్గు 7% వృద్ధిని నమోదు చేస్తూ 6.484 MTల లోడింగ్‌ను అందించడం ద్వారా వృద్ధిని కొనసాగించింది. ద. మ . రైల్వే యొక్క మొత్తం సరుకు రవాణాలో దోహదపడిన ఇతర ముఖ్యమైన వస్తువులు: సిమెంట్ (3.106 ఎమ్ టిలు), ఆహార ధాన్యాలు (0.444 ఎమ్ టిలు), ఎరువులు (0.740 ఎమ్ టిలు), ఇనుప ఖనిజం (0.363 ఎమ్ టిలు) మరియు కంటైనర్లు (0.211 ఎమ్ టిలు). జోన్ అనేక రకాల కార్యక్రమాలు మరియు ప్రత్యేక చర్యలను అమలు చేయడం ద్వారా దాని సరకు రవాణాను బలోపేతం చేయడానికి ప్రత్యేక దృష్టిని సారిస్తుంది. కొత్త ట్రాఫిక్‌ను ఆకర్షించడానికి మరియు ఇప్పటికే ఉన్న ట్రాఫిక్‌ను నిలుపుకోవడానికి జోన్ చురుకైన పద్ధతిలో కదులుతోంది.

సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈ అత్యుత్తమ విజయానికి ఆపరేటింగ్ మరియు కమర్షియల్ టీం లను అభినందించారు. జోన్లో ప్రతి నెల ఉత్తమ పనితీరు నమోదవుతున్న తీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. జోన్ యొక్క మొత్తం పనితీరును మెరుగుపరచడానికి దారితీసిన అన్నివిభాగాల సిబ్బంది యొక్క అద్భుతమైన సమన్వయాన్ని జనరల్ మేనేజర్ అభినందించారు.

Recent

- Advertisment -spot_img