Railway : భారతీయ రైల్వేలు తమ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ఈ క్రమంలో, త్వరలోనే దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ క్రమంలో అన్ని ప్యాసింజర్ రైళ్లు మరియు రైల్వే స్టేషన్లలో మెడికల్ కిట్లను అందించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మందులు, నిత్యావసరాలు సహా ఇతర వస్తువులు ఉన్న మెడికల్ బాక్స్‌లను అందించాలని సూచనలు ఇచ్చామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభకు తెలియజేశారు.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సులను పాటించారు. ప్రాణాలను రక్షించే మందులు మరియు ఇతర ముఖ్యమైన పరికరాలతో కూడిన మెడికల్ బాక్స్‌లను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం, కొన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఇప్పటికే ప్రాథమిక వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ కొత్త ప్రణాళిక ప్రకారం, అన్ని ప్రధాన స్టేషన్లలో 24×7 వైద్య సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ప్రతి స్టేషన్‌లో అత్యవసర వైద్య సేవల కోసం చిన్నపాటి క్లినిక్‌లు లేదా ఆసుపత్రి గదులు ఏర్పాటు చేయనున్నారు.