Railway: మహిళల భద్రత కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళల భద్రత కోసం దక్షిణ మధ్య రైల్వే పానిక్ బటన్లను ఏర్పాటు చేస్తోంది. పానిక్ బటన్ నొక్కితే క్షణాల్లో రైల్వే పోలీసు రాక, RPF నిఘాతో భద్రత పెంచింది. ఇటీవలి అత్యాచారయత్నం ఘటనతో ఉలిక్కిపడ్డ హైదరాబాద్‌లో, ఇకపై ఇలాంటివి నివారించేందుకు ప్రతి రైలులో ఒక పోలీసు అధికారి పర్యవేక్షణ, బందోబస్తు ఉంటుంది.