Railway : భారతీయ రైల్వే (Railway) 13,000 కంటే ఎక్కువ రైళ్లను నడుపుతోంది, దాని విస్తారమైన నెట్‌వర్క్‌లో 20 మిలియన్ల మంది ప్రయాణికులను తీసుకువెళుతుంది. ఈ క్రమంలో 45 ఏళ్లు మరియు సీనియర్ సిటిజన్లు, గర్భిణీ స్త్రీలు , మహిళలు మరియు వికలాంగులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. వీరికి బుకింగ్ సమయంలో నిర్దిష్ట ఎంపిక సూచించనప్పటికీ లభ్యతకు లోబడి ఆటోమేటిక్ గా లోయర్ బెర్త్ లను కేటాయించబడుతాయని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్లీపర్ క్లాస్‌లో ఒక్కో కోచ్‌కు ఆరు నుంచి ఏడు లోయర్ బెర్త్‌లు, ఎయిర్ కండిషన్డ్ 3-టైర్ (3ఏసీ)లో ఒక్కో కోచ్‌కు నాలుగు నుంచి ఐదు లోయర్ బెర్త్‌లు, ఎయిర్ కండిషన్డ్ 2-టైర్ (2ఏసీ)లో ఒక్కో కోచ్‌కు మూడు నుంచి నాలుగు లోయర్ బెర్త్‌లు సీనియర్ సిటిజన్‌ల కోసం కేటాయించబడ్డాయి. గరిష్ట సౌలభ్యం కోసం రైలులోని కోచ్‌ల సంఖ్యను బట్టి ఈ నిబంధన అందుబాటులో ఉంటుందని వైష్ణవ్ తెలిపారు. స్లీపర్ క్లాస్‌లో నాలుగు బెర్తులు (రెండు లోయర్ బెర్తులు సహా), 3AC/3Eలో నాలుగు బెర్తులు (రెండు లోయర్ బెర్తులు సహా) మరియు రిజర్వ్ చేయబడిన సెకండ్ సిట్టింగ్ (2S) లేదా ఎయిర్ కండిషన్డ్ చైర్ కార్ (CC)లో నాలుగు సీట్ల కోటా నిర్ణయించబడింది.