Rain Alert: ఆవర్తన ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో వార్నింగ్‌లు జారీ చేశారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం లేదా సోమవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఏపీ లో నేడు అల్లూరి, మన్యం, అనకాపల్లి, ఏలూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల,కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది
తెలంగాణలో చూస్తే నేడు నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసారు.