తెలంగాణలో కుండపోత వర్షాలకు జనజీవనం స్తంభించింది. పలు జిల్లాల్లో ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాయంత్రం వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, జాగ్రత్తగా ఉండాలని మంత్రులు, అధికారులు సూచిస్తున్నారు. కాగా, రేపు కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.