హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాతబస్తీ, రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి, కొత్తపేట, సరూర్నగర్, చంపాపేట్, సైదాబాద్, మాదన్నపేట్, మలక్పేట్, చాదర్ఘాట్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. కాగా, తెలంగాణలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.