RAIN ALERT: తెలంగాణలో రాబోయే మూడు రోజులు వడగళ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. నిన్న నల్గొండ, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లోని పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఎల్లుండి నుంచి సాధారణం కన్నా 2-3 డిగ్రీలు పెరిగే అవకాశాలు ఉంటాయని తెలుస్తుంది.