దేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు చురుకుగా ముందుకు కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ మంగళవారం గుజరాత్, మహారాష్ట్ర, గోవాలకు రెడ్ అలెర్ట్ జారీ చేయగా.. మరో ఏడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. దీంతో పాటు మరో ఐదు రోజుల పాటు ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్‌మెంట్ అంచనా వేసింది.