తెలంగాణలోని పలు జిల్లాల్లో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిన్న పలు చోట్ల మోస్తరు వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్లలోని నేరెళ్లలో 4.4 సె.మీ, వరంగల్ జిల్లా సంగెం, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో 4.2 సె.మీల చొప్పున వర్షపాతం నమోదైంది.