ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చునని.. రేపు కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.