రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, సూర్యాపేట, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో బలమైన ఉపరితల గాలులు వీస్తాయంది.