తెలంగాణాలో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం, మంగళవారం వరకు ఉమ్మడి వరంగల్, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాలో ఈదరుగాలులతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది.