నైరుతి రుతుపవనాల ప్రభావంతో నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. హైదరాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే చాన్స్ ఉన్నట్లు పేర్కొంది.