Rain Alert: తెలంగాణ ప్రజలు మండే వేడి నుండి ఉపశమనం లభించనుంది. నేటి నుండి నాలుగు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిజామాబాద్, ఖమ్మం, మెదక్ మరియు సంగారెడ్డి జిల్లాల్లో గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గద్వాల్, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్ మరియు మహబూబ్ నగర్ జిల్లాల్లో వడగళ్ల వాన పడే అవకాశం ఉందని అంచనా వేసింది.