తెలంగాణలోని రానున్న 2-3 గంటల్లో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురవనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సుమారు గంటకు 40కి.మీ వేగంతో ఈదురుగాలులు కూడా వీచే ఛాన్స్ ఉందని వెల్లడించింది. కాగా ఇప్పటికే హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది.