HomeతెలంగాణRain Alert: రెమాల్ తుపాను ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..

Rain Alert: రెమాల్ తుపాను ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..

తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రెమాల్ తుపాను ప్రభావంతో తెలంగాణలో ఈదురు గాలులు వీచే అవకాశముందని తెలిపింది. మంగళవారం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి , మెదక్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, సూర్యాపేట, నల్గొండ, కామారెడ్డి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్ తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది.

Recent

- Advertisment -spot_img