Rain Alert: తెలంగాణలో రాబోయే మూడు రోజులు వాతావరణం చల్లగా మారనుంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం కారణంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణశాఖ అధికారి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ, పిడుగులతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ద్రోణి, ఉపరితల అవర్తనం వల్ల తేమతో కూడిన గాలులు రాష్ట్రాన్ని చుట్టుముట్టాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయని, పెద్దగా వేడి ఇబ్బంది ఉండదని తెలిపారు.