తెలంగాణలో రేపటి నుంచి 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. రేపు వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, నల్గొండ, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జూన్ 10 లోపు రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి.