Homeహైదరాబాద్latest NewsRain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షం..!

Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షం..!

కొద్ది రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే వాతావరణ శాఖ మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భద్రాద్రి, ఖమ్మం, మెదక్‌, ములుగు, కరీంనగర్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపింది. నిర్మల్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Recent

- Advertisment -spot_img