రానున్న మూడు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. చిలికా సరస్సు వద్ద కేంద్రీకృతమై ఉన్న వాయు వ్యవస్థ రాత్రి సమయంలో ప్రముఖ అల్పపీడన ప్రాంతంగా బలహీనపడింది. అల్పపీడనం వాయువ్య దిశగా పయనించి ఆదివారం ఉదయం ఒడిశా-ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమైందని తెలిపింది. రాగల 12 గంటల్లో ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. చిలికా సరస్సు వద్ద కేంద్రీకృతమై ఉన్న వాయు వ్యవస్థ రాత్రి సమయంలో ప్రముఖ అల్పపీడన ప్రాంతంగా బలహీనపడింది. అల్పపీడనం వాయువ్య దిశగా పయనించి ఆదివారం ఉదయం ఒడిశా-ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమైందని తెలిపింది. రాగల 12 గంటల్లో ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. నేడు, రేపు ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది.