తెలంగాణలో రాగల 3 రోజుల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈరోజు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ.. గాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం రాత్రి 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.