ద్రోణి, రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కొమరం భీమ్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, మల్కాజిగిరి, వికారాబాద్, నాగర్ కర్నూలు, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలలో మోస్తరు వర్షాలు.. మిగతా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.