Homeహైదరాబాద్భారీ వర్షానికి ట్రాఫిక్​ అస్తవ్యస్తం

భారీ వర్షానికి ట్రాఫిక్​ అస్తవ్యస్తం

హైదరాబాద్‌: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గత మూడు రోజులుగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో నేడు కురిసిన వర్షానికి ట్రాఫిక్​ అస్తవ్యస్తమైంది. కొన్ని ఎరియాలలో చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి సమస్యలు తలెత్తాయి.
నగర వ్యాప్తంగా..
ఖైరతాబాద్‌, పంజాగుట్ట, కూకట్‌పల్లి, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, నాంపల్లి, ఎస్సార్‌ నగర్‌, అమీర్‌పేట, బేగంటపేట, ఎంజే మార్కెట్‌, నాంపల్లి, ఆబిడ్స్‌, కోఠి, బషీర్‌బాగ్‌, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, మల్కాజిగిరి, కుషాయిగూడ, చర్లపల్లి, నాగారం, దమ్మాయిగూడ, ఎల్బీనగర్‌, బోయిన్‌పల్లి, తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img