Homeతెలంగాణమరో రెండు రోజులపాటు కురువనున్న వర్షాలు

మరో రెండు రోజులపాటు కురువనున్న వర్షాలు

తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా పడనున్నట్లు వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒడిశాలోని ఉత్తరకోస్తా, దానిని ఆనుకొని ప.బెంగాల్ లోని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే పరిస్థితి ఇంకో 2 రోజుల పాటు ఎదుర్కోవాల్సి ఉంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img