బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఏపీలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు నిన్న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, నల్గొండలో వర్షాలు కురిశాయి.