హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం నుండి నగరంలో మబ్బులు కమ్ముకోగా.. కొద్దిసేపటి నుంచి వర్షం కురుస్తోంది. సిటీలోని లింగంపల్లిలో భారీ వర్షం కురుస్తోంది. రోడ్ల పై నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.