Homeతెలంగాణమరో ఐదురోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు అలెర్ట్‌..!

మరో ఐదురోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు అలెర్ట్‌..!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో 5 రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 5వ తేదీ నాటికి వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో మంగళవారం నుంచి రాబోయే ఐదు రోజులు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం , నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

Recent

- Advertisment -spot_img