హైదరాబాద్: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న వానల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అప్రమత్తం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావానికి గురయ్యే ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఉత్వర్వుల్లో సీఎస్ ఆదేశించారు.
దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ కర్ణాటక వరకు.. తెలంగాణ, రాయలసీమ మీదుగా 3.1 కి.మీ ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతోనే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వివరించింది.
మరో మూడ్రోజులు వానలే.. బీ అలర్ట్
RELATED ARTICLES