Homeహైదరాబాద్latest Newsవర్షాకాలం.. విద్యుత్ ప్రమాదాలతో జాగ్రత్త.. చిన్న జాగ్రత్తతో పెద్ద మేలు..!

వర్షాకాలం.. విద్యుత్ ప్రమాదాలతో జాగ్రత్త.. చిన్న జాగ్రత్తతో పెద్ద మేలు..!

వానకాలంలో విద్యుత్ ప్రమాదాలు చాలానే జరుగుతుంటాయి. ఈదురుగాలులతో విద్యుత్‌ తీగలు తెగిపోవడం, స్తంభాలు విరిగిపోయి కరెంటు సరఫరా అవుతుండడంతో పశువులతో పాటు ప్రజలు ప్రమాదాల బారిన పడుతుంటారు. రైతులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లినప్పుడు సరైన వైరింగ్‌ లేక.. డిస్ట్రిబ్యూషన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద అనుమతి లేకుండా ఫ్యూజులు మార్చే సందర్భంలో పలువురు షాక్‌తో చనిపోతుంటారు.

చిన్న జాగ్రత్తతో పెద్ద మేలు:
వర్షా కాలంలో రోడ్డు మీద నడుస్తున్న సమయంలో వీలైతే ఇనుప స్తంభాలు పట్టుకోకుండా ఉంటే మంచిది. విద్యుత్‌ స్తంభాలకు దూరంగా నడవాలి. పాఠశాలకు వెళ్లేటప్పుడు, బహిరంగ ప్రదేశాల్లో ఆడుకునేటప్పుడు పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించాలి. వానా కాలంలో విద్యుత్‌ నిరోధక వస్తువులను వినియోగించేలా ప్రోత్సహించండి. గాలివాన సమయంలో బయటకు వెళ్లకపోవడమే మేలు. ఎక్కడైనా తీగలు తెగిపడినా.. అలాంటి అవకాశాలు ఉన్నా.. విద్యుత్‌ శాఖాధికారులకు సమాచారం ఇవ్వాలి.

వర్షాకాలం సొంత మరమ్మతులు చేయొద్దు:
చాలా మంది రైతులు కరెంట్‌ సమస్యలు వస్తే విద్యుత్‌ అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఏమవుతుందిలే అన్న ధోరణిలో సొంతంగా మరమ్మతులు చేస్తుంటారు. అది సరికాదు. కరెంట్‌ స్టార్టర్లకు కచ్చితంగా తలుపులు అమర్చుకోవాలి. మోటర్లపై మందపాటి ప్లాస్టిక్‌ కవర్‌ను కప్పి ఉంచాలి. లేదంటే వర్షానికి తడిసి ఒక ఫేస్‌ తీగ కాలితే మోటర్‌ మొత్తానికి విద్యుత్‌ సరఫరా అవుతుంది. దానిని తాకగానే షాక్‌ కొడుతుంది.

Recent

- Advertisment -spot_img