Homeహైదరాబాద్latest NewsRaithulu : రైతులకు శుభవార్త.. కొత్త పధకాన్ని ప్రారంభించిన సీఎం

Raithulu : రైతులకు శుభవార్త.. కొత్త పధకాన్ని ప్రారంభించిన సీఎం

Raithulu : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గిరిజన రైతుల సంక్షేమం కోసం రూపొందించిన ప్రతిష్ఠాత్మకమైన ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని నేడు నాగర్‌కర్నూల్ జిల్లా మాచారం గ్రామంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు.

ఈ పథకం 2006లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టం (ROFR) కింద హక్కు పత్రాలు పొందిన గిరిజన రైతుల ఆర్థిక, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి రూపొందించబడింది. తెలంగాణలో 2.30 లక్షల మంది ఎస్టీ రైతులకు సంబంధించిన 6.69 లక్షల ఎకరాల పోడు భూములకు సాగు నీటి సౌకర్యం కల్పించడం ఈ పథక లక్ష్యం.. ముఖ్యంగా విద్యుత్ సౌకర్యం లేని 6 లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ ఆధారిత నీటిపారుదల సదుపాయాలను అందించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి.. గిరిజన రైతుల స్వప్నాలను సాకారం చేయడమే ఈ పథకం లక్ష్యం. పోడు భూములను సస్యశ్యామలం చేసి, గిరిజనుల జీవన ప్రమాణాలను ఉన్నతం చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అన్నారు. అలాగే రైతులకు 5, 7.5 హెచ్‌పీ పంపుసెట్లు ఇస్తామన్నారు. అచ్చంపేటను మోడల్‌ నియోజకవర్గంగా మారుస్తామన్నారు.

Recent

- Advertisment -spot_img