తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు భరోసా’ పంపిణీకి సిద్ధమవుతోంది. ప్రస్తుతం రైతు భరోసా ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనే చర్చ నడుస్తోంది. రైతు భరోసా వ్యవసాయ పెట్టుబడి సాయం కోసం రాష్ట్రంలోని ఎకరం ఉన్న రైతుల ఖాతాలో ఏడాదికి రూ.15 వేలు జమ చేస్తామన్నారు. కౌలు రైతులకు కూడా ఈసారి జమ చేస్తామన్నారు. అక్టోబర్ 12 నుంచి అర్హులైన రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.7,500 చొప్పున జమ చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ విడుదల ఉత్తర్వులను ఆర్థిక శాఖకు పంపినట్లు తెలుస్తోంది. రుణమాఫీపై ఇప్పటికే రూ.21 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం తాజాగా రైతు బీమా కోసం దాదాపు రూ.6,500 కోట్లు అవసరమవుతుందని అంచనా వేస్తోంది.