Homeహైదరాబాద్latest NewsRaja Saab Movie : డార్లింగ్స్ బి రెడీ.. ''రాజా సాబ్'' టైమ్ వచ్చేసింది.. టీజర్‌కు...

Raja Saab Movie : డార్లింగ్స్ బి రెడీ.. ”రాజా సాబ్” టైమ్ వచ్చేసింది.. టీజర్‌కు ముహూర్తం ఫిక్స్..!!

Raja Saab Movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ”ది రాజా సాబ్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా రొమాంటిక్ హారర్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇటీవల దర్శకుడు మారుతి ఈ సినిమా విడుదలపై సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. ఆయన తన సోషల్ మీడియాలో రాజా సాబ్‌లో ఆటోరిక్షాపై ఉన్న ప్రభాస్ ఫోటోను పోస్ట్ చేశారు. ఆ ఫోటోకు డైరెక్టర్ మారుతీ ”అలర్ట్.. వేడి గాలులు మే లో మరింత పెరగనున్నాయి’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీనితో మే నెలలోనే ఈ సినిమా టీజర్ రాబోతుంది అని ఫ్యాన్స్ అంటున్నారు.

Recent

- Advertisment -spot_img