భద్రత పెంచిన ప్రభుత్వం
హైదరాబాద్ః ఇటీవల పట్టుబడిన టెర్రరిస్టుల హిట్ లీస్టులో గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి ప్రభుత్వానికి సమాచారం రావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం రాజాసింగ్‌కు భద్రతను పెంచింది. ఈ మేరకు నగర సీపీ అంజనీ కుమార్ ఆయనకు లెటర్ రాశారు. అందులో ఎమ్మెల్యేకు కొన్ని సూచనలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ఫ్రూప్ కారులోనే వెళ్లాలని, బైక్‌పై తిరగొద్దని సీపీ సూచించారు. రాజాసింగ్ గన్‌మెన్స్ కు కొత్త ఆయుధాలను ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇక మీదట డీసీపీ స్థాయి అఫీసర్ ఎమ్మెల్యే భద్రతను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. అయితే తనకు భద్రత పెంచడం పట్ల రాజాసింగ్ విస్మయం వ్యక్తం చేశారు. తనకు ఎవరి నుంచి ప్రాణహాని ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై త్వరలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయనున్నట్లు చెప్పారు.
టెర్రరిస్టుల హిట్‌లీస్టులో ఎమ్మెల్యే రాజాసింగ్
RELATED ARTICLES