Rajamouli : ప్రస్తుతం భారతదేశంలో రాజమౌళి నంబర్ 1 సినిమా దర్శకుడు. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన దర్శకుడు. ‘RRR’ సినిమాతో రాజమౌళి (Rajamouli) హాలీవుడ్‌నే షేక్ చేశాడు. కానీ అలాంటి దర్శకుడిని తెలుగు సినిమా బ్యాన్ చేసింది. రాజమౌళి ‘బాహుబలి’ సినిమా మొదటి భాగానికి దర్శకత్వం వహిస్తున్న సమయంలో అనవసర ఖర్చులు రాకుండా సినిమా షూటింగ్ వీలైనంత వేగంగా జరుగుతుండగా తెలుగు చిత్ర పరిశ్రమ సమాఖ్య సమ్మె ప్రారంభించింది. తక్షణమే అన్ని సినిమాల చిత్రీకరణలు ఆపేయాలని చెప్పినట్లే. కానీ ఫెడరేషన్ నిబంధనల ప్రకారం సమ్మె, నిరసనలుంటే కనీసం 30 రోజుల నోటీసు ఇవ్వాలి. కానీ ఫెడరేషన్ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బంద్ ప్రకటించింది. దీంతో ‘బాహుబలి’ సినిమా కోసం పనిచేస్తున్న సిబ్బంది అంతా సమ్మెకు దిగడంతో షూటింగ్‌కు ఎవరూ హాజరుకాలేదు. బడ్జెట్ చేతికి రాకపోవడంతో రాజమౌళి, దర్శక నిర్మాతలు షూటింగ్ కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. దీన్ని ఫెడరేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాజమౌళితో పాటు మరికొందరిపై నిషేధం విధించింది.