క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటించిన సినిమా ‘పుష్ప2’. ఈ సినిమా విడుదలై రికార్డులు బద్దలుకొడుతుంది.ఈ సినిమా రెండో రోజు 449 కోట్లు వసూళ్లు చేసింది అని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ని చిత్రబృందం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా కెరీర్‌లో రాజమౌళికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే పుష్ప మొదటి భాగాన్ని హిందీలో విడుదల చేయమని ఆయనే చెప్పారు. అందరికీ ఫోన్లు చేయించి చివరికి రిలీజ్ చేయించి దాన్ని పెద్ద సక్సెస్ చేయించారు.ఈరోజు నేను ఇక్కడ నిలబడటానికి కారణం రాజమౌళి గారే అని అన్నారు. మా సినిమా పాన్ ఇండియా సినిమా కాదని అంటే నువ్వు పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తే అదే పాన్ ఇండియా సినిమా అని రాజమౌళి అన్నారు అని సుకుమార్ తెలిపారు. అలాగే ఈ సినిమా కోసం నేనూ, మా టీమ్ కూడా చాలా కష్టపడ్డాం. అంటూ తన బృందాన్ని వేదికపైకి సుకుమార్ అందరిని పిలిచి అభినందించారు. సంధ్య సినిమా థియేటర్ వద్ద జరిగిన ఘటనలో మరణించిన మహిళ కుటుంబాన్ని ఆదుకుంటానని సుకుమార్ హామీ ఇచ్చారు.
.