Rajamouli : ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) తన సినిమాల ద్వారా పాన్ ఇండియాలోనే కాకుండా ప్రపంచ చిత్రసీమలోనే గొప్ప డైరెక్టర్ గా పేరును సంపాందించారు.ప్రస్తుతం మహేష్ బాబుతో రాజమౌళి ‘SSMB29’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని 900-1000 కోట్లు. బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబుతో సినిమా తర్వాత రాజమౌళి తదుపరి సినిమా ఏంటనే విషయంపై టాలీవుడ్ లో ఓ వార్త హల్ చల్ చేసింది. ఈ సినిమా తరువాత రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ చేయనున్నాడు అని తెలుస్తుంది. ఈ సినిమాలో నటించేందుకు రాజమౌళి ఇండియా మొత్తం మీద టాప్ స్టార్స్ ని సెలెక్ట్ చేసారని వార్తలు వస్తున్నాయి. మహేష్ సినిమా పూర్తికాగానే ‘మహాభారతం’ని తెరకెక్కిస్తున్నారు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.