SSMB29 : సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో “SSMB29” అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఒక గ్లోబ్‌ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు హనుమాన్ స్ఫూర్తితో కూడిన ఒక ఎక్స్‌ప్లోరర్‌గా కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా జోనస్, పృథ్వీరాజ్ సుకుమారన్, జిషు సేన్‌గుప్తా తదితరులు కీలక పాత్రల్లో ఉన్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం రాజమౌళి ఒక డైరెక్టర్ ను సాయం కోరాడు అని సమాచారం. ఈ సినిమాలో డైలాగ్ రైటర్ గా ప్రముఖ తెలుగు డైరెక్టర్ దేవా కట్టా ను తీసుకున్నారు. డైరెక్టర్ దేవా కట్టా తన ప్రత్యేకమైన కథన శైలి, సంభాషణలతో తెలుగు సినిమాకు ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించారు. గతంలో దేవా కట్టా సినిమాలైన “ప్రస్థానం”, “ఆటోనగర్ సూర్య”లోని పవర్ఫుల్ సన్నివేశాలు, సంభాషణలను చాలా బాగా రాసాడు. ఈ క్రమంలో “SSMB29” కోసం దేవా కట్టా రాస్తున్న డైలాగ్‌లు సినిమాకు మరింత బలాన్ని ఇస్తాయని అని ఫ్యాన్స్ అంటున్నారు.