సాధారణంగా ఎస్ఎస్ రాజమౌళి తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ పై సీక్రెట్ మెయింటైన్ చేస్తుంటాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పటి నుంచి ప్రమోషన్స్ మొదలయ్యే వరకు సస్పెన్స్ కొనసాగిస్తుంటాడు.
మరోవైపు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం సినిమా గురించి ఏదో ఒక లీక్ ఇస్తుంటారు.
తన కుమారుడికి కథలందించడంతోపాటు ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్టులపై పనిచేస్తున్నారు విజయేంద్ర ప్రసాద్.
ముంబై మీడియాతో రాజమౌళి సినిమాల గురించి చెప్పుకొచ్చారు విజయేంద్రప్రసాద్. రాజమౌళి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా కోసం పాపులర్ సౌతాఫ్రికా రైటర్ విల్బర్ స్మిత్ నవలల నుంచి స్క్రిప్ట్ ను సేకరించాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు.
యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుంది మహేశ్-జక్కన్న ప్రాజెక్టు.
ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో కథ ఉండనుండగా..విల్బర్ స్మిత్ నవలలను స్ఫూర్తిగా తీసుకోనున్నారట.
మొత్తానికి విజయేంద్రప్రసాద్ మరో లీక్ ఇచ్చి ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపుతున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మహేశ్ బాబు సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు జక్కన్న.